బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ ఏడాది ‘వార్ 2’, ‘గేమ్‌ఛేంజర్’ సినిమాలతో తెరపై అలరించింది. ఐతే, ప్రస్తుతం తల్లిగా మాతృత్వపు దశను ఆస్వాదిస్తూనే.. మరోవైపు రాబోయే ప్రాజెక్టుల కోసం రెడీ అవుతుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా.. తన మాతృత్వపు ప్రయాణం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. కియారా మాట్లాడుతూ.. ‘తల్లి అయ్యాక నా శరీరాన్ని, అందాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఇటీవలే విడుదలైన ‘వార్ 2’లోని బికినీ షాట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ డెలివరీ అయ్యాక నా శరీరంలో ఏదో తేడా కనిపించింది’ అని కియారా తెలిపింది.
కియారా ఇంకా మాట్లాడుతూ..’తల్లిని కాకముందే నేను ఉన్నట్లు మళ్లీ ఉండగలనా అనుకున్నా. కానీ ఇక్కడ అందమైన ముఖం, శరీరం ఉండడం ముఖ్యం కాదు. ‘నువ్వు ఒక మనిషిని సృష్టించావు’ అని నా శరీరాన్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు నేను చూడ్డానికి ఎలా ఉన్నా.. నన్ను నేను గౌరవించుకుంటాను. నాకు మాతృత్వం నేర్పిన పాఠాలు ఇవి’ అంటూ కియారా అడ్వాణీ తెలిపింది. అలాగే కియారా అడ్వాణీ ప్రస్తుతం సినిమాల పై ఫుల్ ఫోకస్ పెట్టింది.


