
‘కిక్ 2’.. గత రెండు నెలలుగా అభిమానులను ఎదురుచూపులకే పరిమితం చేసిన సినిమా. ఎన్నో అంచనాల మధ్య భారీ ఎత్తున నిర్మితమైన ఈ సినిమా, ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డా కుడా ‘కిక్’ సినిమాకు సీక్వెల్ వస్తోన్న సినిమా కావడంతో ‘కిక్ 2’పై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. రవి తేజ కెరీర్లో మర్చిపోలేని సినిమాగా నిలిచిన ‘కిక్’ తరహాలోనే ఈ సీక్వెల్ కూడా ఉండనుందని మొదట్నుంచీ ప్రచారం జరిగింది. సురేందర్ రెడ్డి కూడా కిక్కి డబుల్ కిక్ ఇచ్చే సినిమా ఇదని చెబుతూ వచ్చారు.
ఇక అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని భారీ ఎత్తున ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రవి తేజ కెరీర్లో బిజ్జెస్ట్ రిలీజ్‌గా కిక్ 2 నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1150 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలు వెయింట్ చేయించిన సినిమా రిలీజ్ రోజు వచ్చేయడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ‘కిక్’ సినిమాతో కిక్ అనే కాన్సెప్ట్‌ను పట్టుకొచ్చిన రవి తేజ- సురేందర్ రెడ్డిల కాంబినేషన్ ఇప్పుడు కొత్తగా ‘కంఫర్ట్’ అంటూ వస్తోంది. హీరో కళ్యాణ్ నిర్మాతగా రూపొందించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా, థమన్ సంగీత దర్శకత్వం వహించారు.

