
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఇప్పుడు చూసినా బోర్ కొట్టని సినిమా ‘కిక్’. 2009లో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ గా చేసిన సినిమా ‘కిక్ 2’. కిక్ సినిమాలోని రవితేజ – ఇలియానాల కుమారుడు కథే ఈ ‘కిక్ 2’. మొదటి పార్ట్ లో ‘కిక్కు కిక్కు’ అంటూ ప్రేక్షకులను తెగ నవ్వించిన రవితేజ ఈ సారి కంఫర్ట్ కంఫర్ట్ అంటూ తెలుగు ప్రేక్షకులను నవ్వించడానికి సిద్దమయ్యాడు. కిక్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ ని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు.
అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆగష్టు 21న చాలా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ లో ఎలాంటి వాయిదా ఉండదని ఈ చిత్ర టీం మరోసారి ఖరారు చేసారు. అందులో భాగంగా రెండు వారాల ముందు నుంచే ఈ చిత్ర టీం ఈ మూవీ ప్రమోషన్స్ ని భారీ ఎత్తున చేయడానికి సిద్దమయ్యారు. ముందుగా ఆగష్టు 14న చాలా గ్రాండ్ గా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నారు. ఈ వేడుకకి అందరు నటీనటులు హాజరు కానున్నారు. అలాగే టీం మొత్తం ఈ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ప్రణాలికలని సిద్దం చేసారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉండడమే కాకుండా సినిమా కిక్ కన్నా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాడు.
కిక్ సినిమాకి సీక్వెల్ అయిన కిక్ 2 కి కూడా వక్కంతం వంశీ కథని అందించాడు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హై రేంజ్ కామెడీ ఉంటుందని సమాచారం.

