భాగ్యనగరంలో సందడి చేస్తున్న కిక్ 2 టీం

భాగ్యనగరంలో సందడి చేస్తున్న కిక్ 2 టీం

Published on Feb 18, 2015 8:26 AM IST

Kick21

మాస్ మహారాజ రవితేజకి కమర్షియల్ గానే కాకుండా తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చిన సినిమా ‘కిక్’. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే పాత్రతో తెరకెక్కిన ‘కిక్’ సీక్వెల్ గా ‘కిక్ 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో ఉండే రవితేజ – ఇలియానాల వారసుడి కథే ఈ సినిమా. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఈ చిత్ర టీం ఇటీవలే హంపి వెళ్లి అక్కడి లొకేషన్స్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. దాదాపు శివారి దశకు చేరుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 26న రవితేజ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు