ది బెస్ట్ కోసం వర్కౌట్ చేస్తున్న ‘కిక్ 2’ టీం

kick
టాలీవుడ్ లో ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.. రక్త చరిత్ర సినిమా తర్వాత తెలుగులో వస్తున్న సీక్వెల్ ‘కిక్ 2’. 2009లో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమాకి సీక్వెల్ గా మరోసారి సురేందర్ రెడ్డి – రవితేజ కాంబినేషన్ లో రానున్న సినిమా ‘కిక్ 2’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చెయ్యాలనుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆగష్టుకి వెళ్ళింది. దాంతో ఈ చిత్ర టీంకి చాలా ఎక్కువ టైం దొరకడంతో సురేందర్ రెడ్డి సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నాడు.

ముఖ్యంగా రీ రికార్డింగ్, ఎడిటింగ్ విషయాల్లో చాలా కేర్ తీసుకున్నాడు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు టీంకి కొన్ని సీన్స్ మరియు ఒక సాంగ్ సరిగా అనిపించకపోవడంతో వాటిని రీ షూట్ కూడా చేసారు. ఇటీవలే ఓ సాంగ్ ని రీ షూట్ చేసి, ప్రస్తుతం ఎడిటింగ్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి కిక్ అనేది కిక్ సినిమాకంటే బెటర్ గా ఉండాలనే ఉద్దేశంతో ది బెస్ట్ అవుట్ పుట్ కోసం వర్కౌట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఆగష్టులో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. కిక్ సినిమాలో కిక్ కావాలి అంటూ నవ్వించిన రవితేజ ఈ సినిమాలో కంఫర్ట్ అంటూ తెలుగు ప్రేక్షకులను నవ్వించన్నున్నాడు.

రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version