ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ ‘కిక్ 2’ టీజర్

ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ ‘కిక్ 2’ టీజర్

Published on Jan 29, 2015 4:45 PM IST

Kick2
మాస్ మహారాజ రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న ‘కిక్ 2’ సినిమా టీజర్ ను విడుదల చేశారు. స్క్రిప్ట్, స్టొరీ బేస్ చేసుకుని అయ్యేలా రవితేజను చాలా స్టైలిష్ లుక్ లో చూపించిన ఈ టీజర్ యుట్యూబ్ ప్రపంచంలో పెద్ద హిట్ అయ్యింది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

‘రేసుగుర్రం’ విజయంతో మంచి జోరు మీదున్న దర్శకుడు సురేందర్ రెడ్డి, తన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘కిక్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసింది.

‘కిక్ 2’ తర్వాత రవితేజ నటించబోయే ‘బెంగాల్ టైగర్’ సినిమా ముహూర్త కార్యక్రమాలు జనవరి 30న జరుగుతాయి. సంపత్ నంది ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లు.

తాజా వార్తలు