ఇంటర్వ్యూ : రితిక సింగ్ – కిక్ బాక్సింగ్ కంటే నటించడమే చాలా కష్టం !
Published on Apr 10, 2017 6:37 pm IST


రాఘవా లారెన్స్ తాజాగా నటించిన చిత్రం ‘శివలింగ’. ఈ చిత్రంలో రితిక సింగ్ హీరోయిన్ గా నటించారు. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా రితిక సింగ్ మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) మొదట స్పోర్ట్స్ డ్రామా చేశారు, ఇప్పుడేమో థ్రిల్లర్ చేశారు. ఎలా ఫీలవుతున్నారు ?
జ) చాలా డిఫరెంట్ గా ఉంది. ‘గురు’ లో ఎలాంటి మేకప్ ఉండదు. షూటింగ్ లో పెద్ద ఇబ్బంది పడలేదు. కానీ శివలింగాలో చీరలు కట్టుకుని, మేకప్ చేసుకుని నటించాను. అది కాస్త కష్టమైంది. ఒక నార్మల్ అమ్మాయిగా, గోస్ట్ గా చేయడం కూడా చాలెంజింగా అనిపించింది. ఇక వాసు సర్ డైరెక్షన్ అంటే కాస్త టెంక్షన్ అనిపించింది.

ప్ర) లారెన్స్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) ఆయనతో పనిచేయడం చాలా బాగుంది. కానీ ఆయనతో డ్యాన్స్ చేయడం కష్టమనిపించింది. ఆయన చాల బాగా డాన్స్ చేస్తారు. నాకేమో డాన్స్ కొత్త పైగా మోకాలి గాయం కూడా ఇబ్బంది పెట్టింది. ఆయనలా చేయలేకపోయినా నాకు వీలైనంత వరకు ట్రై చేశాను.

ప్ర) మీరు సినిమాల్లోకి రావాలని ఎప్పుడైనా అనుకున్నారా ?
జ) లేదు ఎప్పుడూ అనుకోలేదు. నిజ జీవితంలో నేనొక మార్షల్ ఆర్టిస్ట్. ఇలా సినిమాలోకి వస్తానని, హీరోయిన్ అవుతానని అస్సలు ఊహించలేదు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది.

ప్ర) మీకు సినిమా ఆఫర్ ఎలా వచ్చింది ?
జ) నాకు 18 ఎళ్ళ వయసున్నప్పుడు ఒక మ్యాచ్ ఆడుతుంటే మాధవన్ సర్ కూడా ఆ మ్యాచ్ చూడడానికి వచ్చారు. అయన నన్ను బాగా గమనించి మ్యాచ్ తర్వాత మా నాన్నకు ఫోన్ చేసి ఇలా మా సినిమాకు మీ అమ్మాయి అయితే బాగుంటుందని అడిగారు. ఆ తర్వాత నేను కూడా ఆడిషన్స్ కి వెళ్లడం, వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది.

ప్ర) మీరు భవిష్యత్తులో యాక్షన్ ఓరిటెండ్ సినిమాలు కూడా చేస్తారా ?
జ) అవును తప్పకుండా. నాకెలాంటి అభ్యతరం లేదు. నేను భిన్నమైన పాత్రలు చేయాలని, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. కనుక ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాలైనా సరే చేస్తాను.

ప్ర) భవిష్యత్తులో ఇలాగే హీరోయిన్ గా కొనసాగాలని అనుకుంటున్నారా ?
జ) అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే అన్నీ అనుకున్నట్టే పర్ఫెక్ట్ గా కుదిరితే అలాగే కొనసాగాలని అనుకుంటున్నాను.

ప్ర) ఈ ‘శివలింగ’ సినిమాలో మీకు బాగా నచ్చిన అంశమేమిటి ?
జ) సినిమా కథ, అందులో నా పాత్ర నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. మంచి క్యారెక్టర్, నటనకు స్కోప్ ఉంది. అందుకే కథ వినగానే వెంటనే చేయాలని అనిపించింది.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర వినగానే చేయగలరని అనిపించిందా ?
జ) మొదట ఈ ఆఫర్ నా వద్దకు రాగానే కథ విని ఒరిజినల్ కన్నడ వెర్షన్ ఒకసారి చూశాను. అందులో వేదికగారు చాలా గొప్పగా నటించారు. ఆ తర్వాత వెంటనే ఆ సినిమాను మర్చిపోయి నా ఓన్ స్టైల్లో ఈ సినిమా చేశాను. అది ఎంతవరకు బాగా చేశానో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.

ప్ర) లారెన్స్ నుండి ఏం నేర్చుకున్నారు ?
జ) ఆయన నుండి డాన్స్ చాలా నేర్చుకున్నాను. ఇక హర్రర్ సినిమాల్లో నటించడంలో ఆయనకు చాలా ఎక్స్పీఎరియన్స్ ఉంది. నా సన్నివేశాల్లో ఎలా నటించాలి, డైలాగ్స్ ఎలా చెప్పాలి, నటనతో సీన్ ను ఎలా పండించాలి అనే విషయాల్లో ఆయన బాగా హెల్ప్ చేశారు.

ప్ర) మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ?
జ) నాకు ప్రియాంక చోప్ర, దీపికా పాడుకొనే అంటే చాలా ఇష్టం. వాళ్ళ నటన చాలా బాగుంటుంది. కష్టపడి ఎలా పని చేయాలో వాళ్ళ నుండే నేర్చుకుంటున్నాను. వాళ్లే నాకు ఇన్స్పిరేషన్.

ప్ర) కిక్ బాక్సింగ్, యాక్టింగ్ ఏది కష్టం ?
జ) కిక్ బాక్సింగ్ కంటే నటనే కష్టం. నేను మూడేళ్ళ వయసు నుండి బాక్సింగ్ చేస్తున్నాను. కాబట్టి అది నాకు కష్టం కాదు. కానీ ఉన్నట్టుండి అస్సలు పరిచయంలేని సినిమాల్లోకి వచ్చి నటించడమంటే కష్టాంగా ఉంటుంది.

ప్ర) తెలుగులో ఆఫర్లేమైనా వస్తున్నాయా ?
జ) వస్తున్నాయి. కొన్ని కథలు వింటున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. అది పూర్తయ్యాక కొత్త సినిమా సంగతి చూస్తాను.

 
Like us on Facebook