‘కికి అండ్ కొకొ’ యానిమేషన్ మూవీ టీజర్ విడుదల – 9 భాషల్లో రిలీజ్‌కు ప్లాన్

‘కికి అండ్ కొకొ’ యానిమేషన్ మూవీ టీజర్ విడుదల – 9 భాషల్లో రిలీజ్‌కు ప్లాన్

Published on Dec 27, 2025 8:00 AM IST

3 1

పిల్లలకు వినోదంతో పాటు మానవ విలువలు, వాస్తవికతను నేర్పించే లక్ష్యంతో రూపొందుతున్న యానిమేషన్ చిత్రం ‘కికి అండ్ కొకొ’. ఇనికా స్టూడియోస్ పతాకంపై ధరణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు.

సాధారణ యానిమేషన్ చిత్రాల్లో కనిపించే ఫాంటసీ, సూపర్ పవర్స్ కాకుండా.. నిజ జీవితంలోని భావోద్వేగాలను, పిల్లలు ఎలా నడుచుకోవాలి అనే విషయాలను ఇందులో చూపిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పెద్దలను గౌరవించడం, తోటివారికి సాయం చేయడం వంటి మంచి అలవాట్లను ‘ఎడ్యుటైన్‌మెంట్’ (Education + Entertainment) పద్ధతిలో అందిస్తున్నామని దర్శకుడు పేర్కొన్నారు. ఫాంటసీని పక్కనపెట్టి రియాలిటీని చూపించడమే తమ ఉద్దేశమని క్రియేటివ్ డైరెక్టర్ గోకుల్ రాజ్ భాస్కర్ తెలిపారు.

సీయీవో మీనా చాబ్రియా మాట్లాడుతూ, తమ ‘కలర్ పెన్సిల్’ బ్రాండ్ ద్వారా పిల్లల కోసం బుక్స్, యాప్స్, మర్చండైజ్ కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో బాలనటి శ్రీనిక ‘కొకొ’ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్లతో పాటు, 9 భాషల్లో ఓటీటీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ధరణి వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు