“కిల్లర్” విజయోత్సవ వేడుకలో పాల్గొన్న చిత్రయూనిట్.

Published on Jun 15, 2019 7:08 pm IST

విజయ్‌ ఆంటోని, అషిమా నర్వాల్ ,యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రలలో ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘కొలైగారన్‌’ను పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేశారు.. రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ‘కిల్లర్’ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

అర్జున్ మాట్లాడుతూ తనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కోడి రామకృష్ణకు,అలాగే తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమా విజయమే అరుదైపోతున్న ఈరోజుల్లో దర్శకుడు ఆండ్రూ,హీరో విజయ్ వలనేఇంత పెద్దవిజయం దక్కింది అన్నారు. రెండో వారంలో 60 థియేటర్స్ పెరగటం చిత్ర ఘన విజయానికి సంకేతం అన్నారు.

హీరోయిన్అషిమా మాట్లాడుతూ.కిల్లర్ లాంటి సక్సెస్ఫుల్ మూవీలో నటించినందుకు ఆనందంగా ఉందన్న ఆమె,ఈ అవకాశం ఇచ్చిన హీరో విజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు ఆండ్రూ మాట్లాడుతూ.. కిల్లర్ సక్సెస్ అవ్వటంలో‌మా టీమ్ కీలకం. విజయ్ ఆంథోని వల్లే ఈ సినిమా అవకాశం వచ్చింది అన్నారు.

విజయ్ ఆంథోని మాట్లాడుతూ.. కిల్లర్ లో అర్జున్ గారు చేయడం పెద్ద ప్లస్ ఐయింది అన్నారు. మంచి సినిమాకు తెలుగు వారి ఆదరణ ఉంటుందని ‘కిల్లర్’ తో మరోసారి నిరూపితమైంది. ఆషిమా ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సాధించింది. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి రీచ్ అవుతాడు.
ఇలానే మా‌నుంచి సినిమాలు మరిన్ని రావటానికి కృషి చెస్తామన్నారు.ఈ కార్యక్రమం లో ఇంకా సంగీత దర్శకుడు సైమన్ కింగ్ ,సమర్పకులు అంజయ్య ,నిర్మాత ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ‌

సంబంధిత సమాచారం :

More