ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న మల్టీస్టారర్ ..!

Published on May 20, 2019 10:23 pm IST

ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్‌’. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ట్రైలర్ ను చూస్తుంటే క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌ లో జరిగే ఓ మర్డర్‌ మిస్టరీలా అనిపిస్తోంది. ట్రైలర్ ను బట్టి చెప్పుకుంటే మొత్తానికి సినిమాలో విషయం ఉన్నట్లే అనిపిస్తోంది. ఎప్పటిలాగే యాక్షన్ కింగ్ అర్జున్.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకోగా.. విజయ్ ఆంటోని తన శైలి పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.

అలాగే ట్రైలర్ లో ప్రధానంగా మిస్టరీ టచ్ తో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే ‘చంపొద్దే చంపొద్దే’ అనే పాటను చిత్రీకరించిన లొకేషన్స్ అయితే ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి.

ఇక ఈ సినిమాలో అషిమా కథానాయికగా నటించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సైమ‌న్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More