మూడు షేడ్స్ లో అదరగొట్టిన కింగ్ నాగార్జున.!

మూడు షేడ్స్ లో అదరగొట్టిన కింగ్ నాగార్జున.!

Published on Aug 16, 2020 10:00 AM IST

bigg boss

మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ నాలగవ సీజన్ ఇప్పుడు మొదలు కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత సీజన్ కు అద్భుతంగా హోస్ట్ చేసిన కింగ్ నాగార్జున ఈసారి నాలుగో సీజన్ కు కూడా హోస్ట్ చేస్తున్నారు. అందుకు సంబంధించి నాగ్ పై కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడంతో మరింత హైప్ నమోదు అయ్యింది.

కొన్ని రోజుల కితమే ఒక ఓల్డ్ లుక్ లో ఉన్న ప్రోమో తో ఊహించని అవతార్ లో కనిపించిన నాగార్జున ఇప్పుడు ఫుల్ టీజర్ తో వచ్చారు.బయట ఎవరెవరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూసి ఎంటర్టైన్ అవుతూ కనిపించే ముసలాయనలా, అతని మనవాడిలా అలాగే అతని కొడుకులా మొత్తం మూడు భిన్నమైన షేడ్స్ తో ట్రిపుల్ రోల్ లా సరికొత్త బిగ్ బాస్ టీజర్ లో కనిపించి ఆశ్చర్య పరిచారు. మరి ఈ గ్రాండ్ రియాలిటీ షో ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు