కిరణ్ అబ్బవరం “మీటర్” రిలీజ్ అప్డేట్ టైం ఫిక్స్.!

Published on Mar 1, 2023 1:00 pm IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ” తో తన కెరీర్ లో మరో మంచి హిట్ ని తాను బౌన్స్ బ్యాక్ అయితే అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత తాను మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ చిత్రాల్లో మంచి యాక్షన్ చిత్రంగా వస్తున్న సినిమా “మీటర్”. దర్శకుడు రమేష్ కాడూరి తెరకెక్కిస్తున్న సినిమా నుంచి అయితే మేకర్స్ ఇప్పుడు రిలీజ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు.

మరి ఈ అప్డేట్ అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అయితే యంగ్ హీరోయిన్ అతుల్య రవి నటిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు అలాగే క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :