‘రేప‌టి నుండి మొద‌లెడ‌దాం’ అంటోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం

‘రేప‌టి నుండి మొద‌లెడ‌దాం’ అంటోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం

Published on Jul 4, 2024 12:36 PM IST

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌రం ఇటీవ‌ల వ‌రుస ఫెయిల్యూర్స్ తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఒకప్పుడు వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్లిన ఈ హీరో, ఓ సాలిడ్ క‌మ్ బ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న నెక్ట్స్ మూవీని భారీగా ప్లాన్ చేశాడు కిర‌ణ్.

కాగా, కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో ”లెట్స్ బిగిన్ ఫ్రం టుమారో” అంటూ ఓ ట్వీట్ చేశాడు ఈ హీరో. ‘రేపటి నుండి మొద‌లెడదాం’ అంటూ ఈ హీరో ట్వీట్ చేయ‌డంతో, మ‌రో సినిమాను స్టార్ట్ చేస్తున్నారా అని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.

దీంతో, కిర‌ణ్ అబ్బ‌వ‌రం నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించే ఈ ట్వీట్ చేశాడ‌నే టాక్ సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మ‌రి కిర‌ణ్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ఎవ‌రితో చేస్తున్నాడ‌నే విష‌యంపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు