ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తోన్న సినిమా ‘కిరాక్ పార్టి’. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ కు మంచి రెస్పోన్స్ లభించింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 13 న చెయ్యబోతున్నారు. ఇండస్ట్రీ నుండి కొంతమంది యువహీరోలు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఎక్కువ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మార్చి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంయుక్తా హెగ్డే మరియు సిమ్రాన్ పరీన్జా కథానాయికలుగా నటించిన ఈ మూవీకి అజనీష్ లొకనాథ్ సంగీతం అందించాడు. ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ కొత్తవాళ్ళే ఈ చిత్రంలో నటించడం జరిగింది.


