‘మహేష్ – కీర్తి’ల కెమిస్ట్రీ బాగుందట !

Published on Mar 7, 2021 9:00 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ చాల బాగా వస్తోందని తెలుస్తోంది. నిజానికి దర్శకుడు పరుశురామ్ లవ్ ట్రాక్ లను బాగా రాస్తాడనే పేరు ఉంది. మహేష్-కీర్తిల కెమిస్ట్రీ కూడా చాల బాగా కుదిరిందట. దాంతో వీరిద్దరి నడుమ వచ్చే లవ్ సీన్స్ లో మంచి ఫన్ వర్కౌట్ అవుతుందట.

కాగా పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాలకు, సామాజిక అంశాన్ని జోడించి.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమా రాబోతుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక పరుశురామ్ కెరీర్ లోనే వచ్చిన మొదటి పెద్ద ఛాన్స్ ఇది.. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

సంబంధిత సమాచారం :