బాలీవుడ్ లో పాపులర్ అవుతున్న మహేష్ హీరోయిన్

బాలీవుడ్ లో పాపులర్ అవుతున్న మహేష్ హీరోయిన్

Published on Apr 15, 2014 12:17 PM IST

kriti-sana
పొడుగుకాళ్ళ సుందరి కృతి సనన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది . సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కృతి కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత కృతి సనన్ కి బాలీవుడ్ లో ఒక బంపర్ ఆఫర్ కొట్టేసింది. జాకీ ష్రాఫ్ కుమారుడు బాలీవుడ్ లో హీరోగా పరిచయం అవుతున్న ‘హీరోపంతి’ సినిమాతో బాలీవుడ్ లో పరిచయం కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, పాటలలో కృతి అందరినీ అట్రాక్ట్ చేయడమే కాకుద్నా బాలీవుడ్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

‘హీరోపంతి’ సినిమాని ఫేమస్ నిర్మాత సాజిద్ నదియావాలా నిర్మించాడు. ఈ సినిమాలో కృతి నటన బాగా నచ్చడంతో సాజిద్ తన రాబోయే సినిమాలో కూడా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కృతి ప్రస్తుతం తన బాలీవుడ్ మూవీ తనకి బిగ్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు