కియారా అడల్ట్ కంటెంట్ మూవీలో నటిస్తుందా…?

కియారా అడల్ట్ కంటెంట్ మూవీలో నటిస్తుందా…?

Published on May 28, 2019 12:55 PM IST

టాలీవుడ్ లో ఆరంగేట్రం తోనే టాప్ స్టార్స్ అయిన మహేష్, రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది కియారా అద్వానీ. “భరత్ అనే నేను” లో హోమ్లీ లుక్ లో కనిపించిన కియారా “వినయ విధేయ రామ”లో కొంచెం గ్లామర్ డోస్ పెంచింది.

ఐతే కియారా పై వస్తున్న ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కియారా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఓ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అడల్ట్ కంటెంట్ అంటే శృతిమించిన శృంగార సన్నివేశాలతో కొంచెం బోల్డ్ సీన్స్ ఉంటాయి.

“ఇందూ కి జవానీ” అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో కియారా డేటింగ్ యాప్స్ లో అబ్బాయిలను పరిచయం చేసుకొని వారితో డేటింగ్ చేసే అమ్మాయి పాత్రలో నటిస్తుందంట. ఐతే కియారా ఇంతకు ముందే “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ లో ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న పాత్ర చేసివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు