ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో సుదీర్ బాబు చేసిన లేటెస్ట్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఒక కుర్రాడి లైఫ్ లో మూడు దశల్లో జరిగిన ప్రేమకథగా, మనసుకు హత్తుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తోంది. చూసిన వారంతా ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా చెబుతుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడటానికి ఇష్టపడుతున్నారు.
ప్రేక్షకుల మౌత్ టాక్ బాగుండడంతో ఈ సినిమాకి ఓపెనింగ్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. అందుకోసమే మూడవ రోజు నుంచి మరో 24 థియేటర్స్ ని కూడా పెంచారు. సుధీర్ బాబు మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో చాలా బాగా చేసాడని అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు తనపై ప్రశంశల జల్లు కురిపించారు. లగడపాటి శ్రీధర్ – శిరీష కలిసి నిర్మించిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, దగ్గుబాటి రానా అతిధి పాత్రల్లో కనిపించారు.


