కోడి రామకృష్ణ సమర్పణ లో కిరణ్ అబ్బవరం చిత్రం!

Published on Jul 15, 2021 1:02 pm IST


దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ సమర్పణ లో కొత్త చిత్రం శ్రీకారం చుట్టడం జరిగింది. కోడి రామకృష్ణ పెద్ద కూతురు అయిన కోడి దివ్య కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ అంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారబించడం జరిగింది. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న చిత్రం లో హీరొ గా కిరణ్ అబ్బవరం నటిస్తున్నారు. ఈ చిత్రం కిరణ్ కి ఐడవ చిత్రం అని తెలుస్తోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తుండగా, కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే కోడి రామకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన అగ్ర దర్శకుడు. అతను చివరగా అనుష్క తో తీసిన అరుంధతి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళ్లు రాబట్టిందో అందరికీ తెలిసిందే. అయితే సినిమా పై ఉన్న అభిమానం తో ఈ ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు గా, రైటర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న కోడి రామకృష్ణ తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ, మళయాళ, హిందీ భాషల్లో సైతం చిత్రాలను తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :