భారీ అంచనాలతో విడుదలవుతున్న నయన్ ‘కోకో’ !

భారీ అంచనాలతో విడుదలవుతున్న నయన్ ‘కోకో’ !

Published on Aug 16, 2018 6:00 PM IST

సౌత్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి నయన తార తమిళ భాషలో నటించిన తాజా చిత్రం ‘కొలమావు కోకిల'(కోకో). నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్ ప్రధాన పాత్రలో నటిచింది. ఈ సినిమా అంతా డ్రగ్స్ చుట్టూ తిరుగుతువుంటుంది .

ఇక ఈ చిత్రం ఆగస్టు 17న విడుదలకానుంది. నయన్ నటించిన ఈ చిత్రం ఫై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో అవుతున్నాయి.

అయితే ఈ చిత్రం తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో విడుదలకావల్సి ఉండగా ఎందుకనో వాయిదా వేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో యోగిబాబు, శరణ్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు