రెండు రోజుల్లో నయన్ బాగానే రాబట్టింది !

రెండు రోజుల్లో నయన్ బాగానే రాబట్టింది !

Published on Aug 19, 2018 3:40 PM IST

Nayan

లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ భాషలో నటించిన చిత్రం ‘కొలమావు కోకిల'(కోకో). ఈ చిత్రం ఆగస్టు 17న విడుదలై మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు ఈ చిత్రం తమిళనాడులో రూ.3.47కోట్లు అలాగే రెండవ రోజు 3.61కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.

లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈచిత్రంలో నయన్ నటన, అనిరుధ్ సంగీతం సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరణ్య, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈచిత్రం ‘కోకో కోకిల’ పేరుతో త్వరలో తెలుగులో విడుదలకానుంది.

తాజా వార్తలు