బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో కొరటాల శివ నెక్స్ట్ మూవీ.?

బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో కొరటాల శివ నెక్స్ట్ మూవీ.?

Published on Sep 9, 2015 10:11 PM IST

koratala-shiva
రైటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసి దర్శకుడిగా మారిన కొరటాల శివ తన మొదటి రెండు సినిమాలైన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన శ్రీమంతుడు సినిమా అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత కొరటాల శివకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. తన మూడవ సినిమా ఏ హీరోతో, ఏ ప్రొడక్షన్ హౌస్ తో చేయనున్నాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇదివరకూ కొరటాల శివ నెక్స్ట్ మూవీ కూడా మైత్రి మూవ్ మేకర్స్ బ్యానర్ లోనే ఉంటుందని అన్నారు.

కానీ తాజాగా మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ అయిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కొరటాల శివ మూడవ సినిమా ఉంటుందని సమాచారం. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం బండ్ల గణేష్ కొరటాల శివతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీతో పాటు ఏ హీరోతో సినిమా ఉంటుంది అనే దానిపై కూడా అధికారిక ప్రకటన వెలువడనుంది. టెంపర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బండ్ల గణేష్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాతో మళ్ళీ రావాలని పర్ఫెక్ట్ గా కథ, కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది అనే దాని కోసం మరో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు