కొలవేరి డి సంగీత దర్శకుడి కల నెరవేరింది..!

కొలవేరి డి సంగీత దర్శకుడి కల నెరవేరింది..!

Published on Jul 2, 2014 1:26 PM IST

anirudh-ar-rahaman
కొలవేరి డి పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఆ తర్వాత తమిళంలో సంగీత దర్శకుడిగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనిరుధ్ చాలా సంతోషంగా ఉన్నాడు. స్వర మాంత్రికుడు ఏఅర్ రెహమాన్ సంగీతంలో ఓ పాట పాడడమే ఈ యువ సంచలనం ఆనందానికి కారణం.

విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఐ’. తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక పాట కోసం అనిరుధ్ తన గొంతును సవరించుకున్నాడు. ‘చాలా సరదాగా , సంతోషంగా సమయం గడిచిపోయింది, రెహమాన్ సంగీతంలో ‘ఐ’ సినిమా కోసం పాట పాడను. ఈ అవకాసం ఇచ్చిన శంకర్, రహమాన్ లకు నా కృతజ్ఞతలు. ‘ఐ’ ఆడియోపై ఇప్పుడు అంచనాలు తారాస్థాయికి చేరుంటాయి’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

తాజా వార్తలు