2020 సమ్మర్ కి టాప్ స్టార్స్ కూల్ మూవీస్..!

Published on Aug 21, 2019 9:26 am IST

వచ్చే ఏడాది సమ్మర్ కి నలుగురు తమిళ టాప్ స్టార్స్ సందడి చేయనున్నారు.తలా అజిత్, తలపతి విజయ్, చియాన్ విక్రమ్, సూర్య నలుగురు స్టార్ హీరోలు తమ చిత్రాలను 2020 వేసవికి విడుదల చేయనున్నారని తాజా సమాచారం. దీనితో కోలీవుడ్ లో వేసవి సందడి కోలాహలంగా మారనుందనిపిస్తుంది.

చియాన్ విక్రమ్, విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ తో చేస్తున్న ధ్రువ నక్షత్రం వేసవి కానుకగా విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారట. ఇక సూర్య, లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్న జిఆర్ గోపినాధ్ బయో పిక్ సురారై పోట్రు, తల అజిత్ దర్శకుడు వినోత్ ఎహ్ కాంబినేషన్ లో రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ అలాగే తలపతి విజయ్ 64వ చిత్రంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం కూడా వేసవికే విడుదల అవనున్నాయట. దీనితో వచ్చే ఏడాది వేసవి స్టార్ హీరోల సినిమాలతో మరింత హీటెక్కనుంది.

సంబంధిత సమాచారం :