బ్రిటిష్ సైనికులతో ఎన్టీఆర్ ఫైట్ !

బ్రిటిష్ సైనికులతో ఎన్టీఆర్ ఫైట్ !

Published on Jun 4, 2019 5:00 PM IST

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రెండో షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఆ గాయాల కారణంగా దాదాపు ఏడు వారాల పాటు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన చిత్రబృందం ప్రస్తుతం ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

కాగా ఈ సన్నివేశాల్లో (ఎన్టీఆర్) కొమరం భీంకు బ్రిటిష్ సైనికులకు మధ్య ఫైట్ సీన్ ను ఉందట. నైట్ ఆ సీన్ కి సంబంధించే షూట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు