‘బ్రూస్ లీ’ పుకార్లపై స్పందించిన కోన వెంకట్!

kona-venkat
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రూస్ లీ’ సినిమా దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఓ మోస్తారు ప్రదర్శనను కనబరుస్తూ 40 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో గత కొద్దిరోజులుగా పలు రకాల కథనాలు వెలువడుతూ వస్తున్నాయి. రోజురోజుకీ ఈ కథనాలు, రకరకాల ప్రచారాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో ‘బ్రూస్ లీ’ టీమ్ వీటన్నింటికీ సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది.

ఈ ప్రచారాలపై బ్రూస్ లీ రచయిత కోన వెంకట్ స్పందిస్తూ.. ‘బ్రూస్ లీ’ సినిమా విషయంలో వస్తోన్న పుకార్లను నమ్మొద్దని, సినిమా ఇప్పటికీ మంచి రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ నడుస్తోందని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు. మెగా స్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత స్క్రీన్‌పై దర్శనమివ్వడం బ్రూస్ లీ సినిమా విషయంలో హైలైట్‌గా నిలిచింది.

Exit mobile version