వెంకీమామ నుండి కోనా వెంకట్ తప్పుకున్నాడు !

Published on Apr 6, 2019 8:14 am IST

విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామ ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రారంభానికి ముందు వరకు ఈ చిత్రాన్ని సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ , కోన వెంకట్ కలిసి నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లు గానే సినిమా లాంచింగ్ కు కూడా హాజరైయ్యాడు కోనా వెంకట్. ఆ తరువాత ట్విట్టర్ ద్వారా పలు సార్లు ఈచిత్రం గురించి అప్డేట్స్ కూడా ఇచ్చాడు.

అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా యొక్క టైటిల్ పోస్టర్ ను రివీల్ చేసింది. ఈ పోస్టర్ లో కోనా పేరు ఎక్కడా కనిపించలేదు. దాంతో ఈ చిత్రం నుండి కోనా తప్పుకున్నాడని నిర్ధారణ అయ్యింది. మరి ఆయన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నారో తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :