చైతూ బర్త్‌డేకి ‘సాహసం శ్వాసగా..’ స్పెషల్ గిఫ్ట్!

చైతూ బర్త్‌డేకి ‘సాహసం శ్వాసగా..’ స్పెషల్ గిఫ్ట్!

Published on Nov 3, 2015 10:36 AM IST

Naga-Chaitanya
నాగ చైతన్య హీరోగా క్లాస్ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే ఓ కూల్ లవ్‌స్టోరీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్ కాంబినేషన్ అయిన నాగ చైతన్య, గౌతమ్ మీనన్‌లు కలిసి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాకు మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపించింది. ఇక నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ రెట్టింపయ్యాయి.

టీజర్ చూసినవారంతా ఏ మాయ చేశావే మ్యాజిక్ రిపీట్ కానుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా సాహసం శ్వాసగా సాగిపో సినిమాకు సంబంధించిన మరో స్పెషల్ టీజర్‌ను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. చీతూ పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త టీజర్‌ను విడుదల చేయనున్నామని సినిమా నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ స్పష్టాం చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ జరుగుతోంది. వచ్చే నెలలో ఆడియో, సినిమాను విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

తాజా వార్తలు