కొరటాల చిరుతో ఫిక్సయ్యాడు, మరి సుకుమార్ సంగతేంటి?

Published on Jun 2, 2019 3:57 pm IST

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకులు సుకుమార్, కొరటాల శివ. రచయితగా ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలుపెట్టిన కొరటాల శివ ప్రభాస్ తో “మిర్చి” చేసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తరువాత ఆయన ,మహేష్,ఎన్టీఆర్ తో చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు నమోదు చేయడంతో కొరటాల టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైపోయాడు.అలాగే సుకుమార్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మొదటి సినిమా అల్లు అర్జున్ హీరోగా “ఆర్య” అనే ఓ భిన్నమైన ట్రైయాంగిల్ ప్రేమ కథా చిత్రం తో మంచి విజయాన్ని అందుకున్నారు. లాజిక్ మిస్సవకుండా సినిమాలో మేజిక్ చేయడం సుకుమార్ స్టైల్. మొదటిసారి “రంగస్థలం” తో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన ప్రతిభకు తగ్గ హిట్ అందుకున్నాడు సుకుమార్.

ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడితే చాలు స్టార్ హీరో లు ,ప్రొడ్యూసర్ లు డైరెక్టర్స్ ఇంటి ముందు వరుసకట్టేస్తారు. అలాంటిది బ్లాక్ బస్టర్స్ డైరెక్టర్స్ సుకుమార్ ,కొరటాల శివ దాదాపు సంవత్సరం నుండి కొత్త మూవీ స్టార్ట్ చేయడానికి నిరీక్షిస్తున్నారు. సుకుమార్ ‘రంగస్థలం” గత ఏడాది మార్చిలో విడుదల కాగా, కొరటాల శివ “భరత్ అనే నేను” ఏప్రిల్ నెలలో విడుదలైంది. ఈ రెండు బాక్స్ఆఫీస్ దగ్గర సత్తా చాటిన చిత్రాలే అయినా, ఈ ఇద్దరు దర్శకులు అవకాశాల కోసం ఎదురుచూడడం దురదృష్టమనే చెప్పాలి.

సుకుమార్ మహేష్ కోసం సిద్ధం చేసిన కథ ఆయనకు నచ్చకపోవడంతో వంశీ పైడిపల్లి మూవీ “మహర్షి” ని పూర్తి చేశారు. మహేష్ తిరస్కరించినతరువాత సుకుమార్ అల్లు అర్జున్ కొరకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. అల్లు అర్జున్ కొంతకాలం వెయిట్ చేయించి త్రివిక్రంతో ఫిక్సయిపోయాడు. ఇక ఎన్టీఆర్,రామ్ చరణ్ “ఆర్ ఆర్ ఆర్ ” ప్రాజెక్ట్ నుండి 2020 జులై తర్వాతే బయటకొచ్చేది, దీనితో సుకుమార్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకివెళుతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు.

సుకుమార్ తో పోల్చుకుంటే కొరటాల పరిస్థితి కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఆయన కూడా సంవత్సరం కాలంగా చిరంజీవి కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి చిరు కొరటాల శివ ల మూవీ ఎప్పుడో మొదలుకావల్సివున్నా “సైరా” షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఆలస్యమైంది. చిరు పుట్టిన రోజు సంధర్బంగా ఆగస్టు 22న ఈ మూవీ ప్రారంభకార్యక్రమం జరగనుంది. కాబట్టి కొరటాల శివ మూవీ మొదలుపెట్టినట్లే. పాపం సుకుమార్ మాత్రం ఏ స్టార్ హీరో దొరకక ఏమి చేయాలనే అయోమయంలో పడ్డారు.

సంబంధిత సమాచారం :

More