‘భరత్ అనే నేను’ కథపై క్లారిటీ ఇచ్చిన కొరటాల !


స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘భరత్ అనే నేను’. మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలకానుంది. అయితే చాలా రోజుల నుండి ఈ సినిమా కథ ‘తకిట తకిట’ సినిమా దర్శకుడు శ్రీహరి నానుది అని, దాన్ని కొరటాల శివ పెద్ద మొత్తం చెల్లించి కొన్నారనే వార్తలు తెగ హడావుడి చేశాయి.

తాజాగా మీడియాతో మాట్లాడిన కొరటాల శివ కెరీర్ ఆరంభంలో తాను, శ్రీహరి నాను రూమ్ మేట్స్ అని, అప్పుడు అతను తనకీ స్టోరీ లైన్ చెప్పాడని, దాన్ని తానే పూర్తి కథగా డెవలప్ చేశానని, స్టోరీ లైన్ ఇచ్చినందుకుగాను సినిమా టైటిల్స్ లో శ్రీహరి నాను పేరును ప్రత్యేకంగా మెన్షన్ చేశానని అన్నారు.

మహేష్, కొరటాల శివలు కలిసి చేస్తున్న ఈ రెండవ చిత్రం తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.