యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ, తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. మహేష్ తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నాడు.
కొరటాల శివ చెప్పిన కథకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. సవ్యంగా అన్ని పనులు జరిగితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కొరటాల సినిమా పట్టాలెక్కించాలని బన్ని ప్లాన్ చేస్తున్నాడు. మరిన్ని వివరాల కోసం 123తెలుగు.కామ్ సైట్ ను సందర్శిస్తూ ఉండండి.


