హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో స్టార్ దర్శకుల జాబితాలో స్థానం దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ నాల్గవ చిత్రం ‘భరత్ అనే నేను’తో మరొక సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం కొరటాల, మహేష్ ఇద్దరి కెరియర్లలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ద్వారా మంచి రాజకీయపరమైన సందేశాన్ని అందించినందుకుగాను కొరటాల శివకు మంచి ప్రసంశలు దక్కుతున్నాయి.
ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాల్లో సోషల్ మెసేజ్ ను ప్రధానంగా చెప్పిన కొరటాల ఈసారి చేయబోయే సినిమా మాత్రం పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా ఉంటుందని, అందులో కూడ సామాజిక సందేశాన్ని ఇస్తానని, అయితే అది తన గత సినిమాల్లో ఉన్నంత హెవీగా ఉండబోదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లే ఏర్పాట్లలో ఉన్న ఆయన ఆ వెకేషన్ నుండి తిరిగిరాగానే కొత్త సినిమా పనుల్ని మొదలుపెట్టనున్నారు.
