‘మిర్చి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల శివ దాదాపు ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. మొదటగా ఇదొక సిస్టర్ సెంటిమెంట్ సినిమా అని రావడం, అలాగే దానికి తగ్గట్టు పలు టైటిల్స్ తెరపైకి వచ్చాయి వాటన్నిటినీ కొరటాల కొట్టిపారేశాడు. తాజాగా మరో వార్తా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. అదే 2015 న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న మహేష్ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం అభిమానుల్లో ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చింది.
కానీ కొరటాల శివ ఈ రోజు ఆ ఆనందాన్ని వాళ్ళకి ఉండకుండా చేసాడు. ‘జనవరి 1న మహేష్ మూవీ ఫస్ట్ లుక్ వస్తుందని వస్తున్నా వార్తల్లో నిజం లేదు. ది బెస్ట్ లుక్ ఇవ్వడానికి మాకింకాస్త టైం కావాలని’ అని కొరటాల శివ తెలిపాడు. ఇటీవలే మహేష్ బాబు – శృతి హాసన్ లపై ఓ కీలక సన్నివేశాలను షూట్ చేసారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


