చరణ్ పాత్ర గురించి చెప్పిన కొరటాల !

చరణ్ పాత్ర గురించి చెప్పిన కొరటాల !

Published on May 23, 2021 11:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ‘ఆచార్యలో చరణ్ కథ కూడా ఎంతో కీలకమైనది అని, చరణ్ సెకండాఫ్ లో ఎక్కువ భాగం ఉంటాడని, ఇక ఈ సినిమాలో చిరంజీవి-చరణ్ తండ్రికొడుకులు కాదని’ తాజాగా కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు.

ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు