‘ఆచార్య’కు జరిగినట్టు ఎన్టీఆర్ సినిమాకు జరగకూడదంటున్న కొరటాల

Published on Jun 5, 2021 1:00 am IST

కొరటాల శివ సినిమా చేయడానికి ఎక్కువ సమయమే తీసుకుంటారు. ఏడాదిలో ఆయన్నుండి ఒక్కటంటే ఇక్కటే సినిమా వస్తుంది. కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయడం కొరటాల శివ స్టైల్. కానీ ‘ఆచార్య’ విషయంలో అది కుదరలేదు. లాక్ డౌన్ మూలంగా సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవడమే కాదు అసలు షూటింగ్ కూడ పూర్తికాలేదు. ఇది అభిమానులకు ఒకింత నిరుత్సాహాన్ని కలిగించింది. కొరటాల సైతం ఏ సినిమాకు వెచ్చించనంత సమయం ఈ సినిమాకి వెచ్చించాల్సి వచ్చింది. అది తన పొరపాటు కాకపోయినా దాన్ని తీవ్రంగానే తీసుకున్నారట ఆయన. తన తర్వాతి సినిమా విషయంలో ఇలాంటి ఆలస్యం అనేది లేకుండా చూసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట.

కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ హీరోగా ఉండనుంది. కొరటాల ‘ఆచార్య’ను పూర్తిచేసే సమయానికి ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఫ్రీ అవుతారు. అప్పుడు వారి ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఈసారి ముందుగా ప్రీ ప్రొడక్షన్ కోసం ఇంత టైమ్, ప్రొడక్షన్ కోసం ఇన్ని నెలలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఇంత సమయం అని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ ప్రకారమే సినిమాని పూర్తి చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండకూడదని డిసైడ్ అయ్యారట. సో..ఈసారి మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు అన్ని అప్డేట్స్ టైమ్ టూ టైమ్ అందిపోనున్నాయన్నమాట.

సంబంధిత సమాచారం :