‘కొరియన్ కనకరాజు’ అదరగొట్టేస్తున్నాడు.. అక్కడ కూడా..!

‘కొరియన్ కనకరాజు’ అదరగొట్టేస్తున్నాడు.. అక్కడ కూడా..!

Published on Aug 8, 2026 1:59 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్య, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు.

​ఇక యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. అక్కడ ఇప్పటివరకు 125K డాలర్ల గ్రాస్ మార్కును దాటి వసూళ్లతో దూసుకుపోతోంది. వరుణ్ తేజ్ గత కొన్ని చిత్రాలు ఓవర్సీస్‌లో సరిగ్గా రాణించని నేపథ్యంలో ఈ ప్రారంభ వసూళ్లు ఆయన కెరీర్‌కు మంచి ఊరటనిచ్చాయి. శుక్రవారం కూడా కలెక్షన్లు బలంగా ఉండటంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తాజా వార్తలు