‘సమవర్తి’తో సత్యదేవ్ పెద్ద ఛాలెంజ్.. టార్గెట్ భారీగా సెట్ చేస్తున్నాడుగా..!

‘సమవర్తి’తో సత్యదేవ్ పెద్ద ఛాలెంజ్.. టార్గెట్ భారీగా సెట్ చేస్తున్నాడుగా..!

Published on Sep 22, 2026 1:04 AM IST

Samavarthi

విలక్షణ నటుడు సత్యదేవ్ తనదైన విభిన్నమైన కథలతో ప్రేక్షకుల మెప్పు పొందినప్పటికీ, ఆయనకు సరైన కమర్షియల్ విజయం మాత్రం దక్కడం లేదు. ‘రావు బహదూర్’ లాంటి చిత్రాలు నటుడిగా సంతృప్తినిచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి. దీంతో ఈసారి అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ‘సమవర్తి’ చిత్రంతో ఎలాగైనా సరే పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలని సత్యదేవ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు నిర్మాతల పాలిట పెద్ద సవాలుగా మారింది. ప్రమోషన్లు, వడ్డీలతో కలిపి దాదాపు రూ. 20 కోట్ల వరకు ఖర్చవ్వడంతో, సత్యదేవ్ మార్కెట్‌తో పోలిస్తే ఇది భారీ రిస్క్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ చిత్ర నాన్-థియేట్రికల్, ఓటీటీ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు.

నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా కనీసం రూ. 10 నుండి 12 కోట్లు వస్తేనే ఈ ప్రాజెక్ట్ గట్టెక్కే అవకాశముంది. మరి ‘సమవర్తి’తో సత్యదేవ్ ఆశించిన విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు