‘కొరియన్ కనకరాజు’ రైట్స్ కోసం SVC.. ఈ ప్రాంతాల్లో గ్రాండ్ రిలీజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ హారర్-కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7, 2026న థియేటర్లలో విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీతికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

కాగా ఈ సినిమా నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దక్కించుకుంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version