మెగా యంగ్ హీరోస్ లో ఒకరైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. ఒక ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్ కి యూనానిమస్ రిపోర్ట్స్ తో భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. తన కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కడంతో మెగా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకి హైదరాబాద్ లాంటి మేజర్ సిటీలో ప్రముఖ మల్టీప్లెక్స్ లలో డే 2 హౌస్ ఫుల్స్ తో అదరగొట్టేస్తుంది. మొత్తం 48 షోస్ కి మొత్తం అన్ని షోలు హౌస్ ఫుల్స్ ఈ చిత్రానికి పడిపోయాయి. దీనితో కొరియన్ కనకరాజు హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రితికా నాయక్ నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
RAINING HOUSEFULLS ALL OVER FOR #KoreanKanakaraju 🤩🔥
Packed shows, roaring crowds and NON-STOP ENTERTAINMENT everywhere 💥
PHENOMENAL DAY-2 ON CARDS 🫰🏻⏳
— https://t.co/zYQjFkvmSI@IamVarunTej @RitikaNayak_ @GandhiMerlapaka #Satya @MusicThaman #ManojhReddy #RajeevReddy… pic.twitter.com/OPqCajEm6D
— UV Creations (@UV_Creations) August 8, 2026


