మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఐతే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా 2026 ఆగస్టు 7న విడుదల కానుందట. జూన్ మూడవ వారంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక కొత్త గ్లింప్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందట.
కాగా ఈ ప్రాజెక్ట్‌ను యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సమకూరుస్తున్నారు. అన్నట్టు, ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.


