మంచి ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యిన “కోటబొమ్మాళి పి ఎస్”

మంచి ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యిన “కోటబొమ్మాళి పి ఎస్”

Published on Nov 25, 2023 12:00 PM IST

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సీనియర్ నటుడు శ్రీకాంత్ ముఖ్య పాత్రలో యంగ్ నటీనటులు రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ లు కలయికలో దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రమే “కోటబొమ్మాళి పిఎస్”. మరి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ చేసిన ఈ చిత్రం అయితే ‘నాయట్టు’ అనే సినిమాకి రీమేక్ గా మేకర్స్ తెరకెక్కించారు.

అయితే ఈ చిత్రం మొదటి రోజే మంచి వసూళ్ళని నమోదు చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. డే 1 కి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 1.75 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీనితో ఈ సినిమాకి సాలిడ్ స్టార్ట్ తోనే మొదలైంది అని చెప్పాలి. మెయిన్ గా మధ్యాహ్నం షోస్ నుంచి ఈ చిత్రం పికప్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి వీకెండ్ కి కూడా సినిమాకి బాగానే ప్లస్ అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు