హైదరాబాద్‌లో ‘కొత్త సినిమా’ ప్రత్యేక కార్యక్రమం..త్వరలోనే థియేటర్లలో విడుదల

హైదరాబాద్‌లో ‘కొత్త సినిమా’ ప్రత్యేక కార్యక్రమం..త్వరలోనే థియేటర్లలో విడుదల

Published on Aug 25, 2026 8:00 AM IST

స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ నూతన దర్శకుడు అజర్ తెరకెక్కించిన ‘కొత్త సినిమా’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో దాదాపు వంద మంది కొత్త నటీనటులు కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, ఎడిటింగ్ బాధ్యతలను కూడా అజర్ స్వయంగా నిర్వర్తించారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్ర ప్రచారంలో భాగంగా ‘వై ఇన్ హైదరాబాద్ వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ పేరుతో హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్. శంకర్, వీఎన్ ఆదిత్య, వీరశంకర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నటీనటులకు శిక్షణ ఇచ్చి, సింగరేణి నేపథ్యంలో సినిమాను పూర్తి చేయడం దర్శకుడి పట్టుదలకు నిదర్శనమని వక్తలు కొనియాడారు.

జానీ బాషా ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు