యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా ‘కొత్త‌గా మా ప్ర‌యాణం’ !

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా ‘కొత్త‌గా మా ప్ర‌యాణం’ !

Published on Nov 24, 2018 2:21 PM IST

kothaga maa prayanam1

ప్రియాంత్‌, యామిని భాస్కర్ జంటగా ఈ వ‌ర్షం సాక్షిగా` ఫేం ర‌మ‌ణ దర్శకత్వంలో నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్నచిత్రం `కొత్త‌గా మా ప్ర‌యాణం’ తాజాగా విడుదలైన ఈ సినిమా టీజ‌ర్ ఆకట్టుకుంటుంది.

ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మాట్లాడుతూ `న‌లుగురికి సాయ‌ప‌డుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమ‌క‌థ ఇది. న‌లుగురికి సాయ‌ప‌డే త‌త్వం ఉన్న అత‌డికి ప్రేమ‌, పెళ్లి, కుటుంబం వంటి విలువ‌ల‌పై అంతగా న‌మ్మ‌కం ఉండ‌దు. అయితే అలాంటివాడు మ‌న సాంప్ర‌దాయం విలువ‌ను, గొప్ప‌త‌నాన్ని తెలుసుకుని అటుపై ఎలా మారాడు? అన్న‌ది ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా చూపించాం. యువ‌త‌రాన్ని టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు