మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా, కుటుంబ చిత్రాల దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కోతి కొమ్మచ్చి. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటివలే అమలాపురం , వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చ్ ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
మేఘా చౌదరి , రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ , నరేష్ కీలక పాత్రల్లో నటించారు. అన్నపూర్ణమ్మ , సిజ్జు శ్రీ నాయర్, మణి చందన , ప్రవీణ్, సుదర్శన్, శివన్నారాయణ, ఆనంద్ వర్మ ,చింటు , రచ్చరవి తదితరులు మంచి పాత్రల్లో కనిపించనున్నారు. అనుప్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ త్వరలోనే విడుదల కానున్నాయి.


