Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ఇంటర్వ్యూ : హీరో ప్రియాంత్ – మా సినిమాలో స్నేహానికి స‌హ‌జీవ‌నానికి డిఫ‌రెన్స్ చూపించాం !
Published on Jan 22, 2019 10:50 pm IST

ఫ్రాంక్ గా ఉంటే వ‌చ్చే చిక్కుల గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా ఉండే కుర్రాడు ఓ అమ్మాయి విష‌యంలోనూ సూటిగా ఉంటే ఆ త‌ర్వాత ఎదురైన ప‌రిణామాలేంటి ? అన్నదే మా సినిమా.. స్నేహానికి స‌హ‌జీవ‌నానికి మ‌ధ్య ఉండే ఓ స‌న్న‌ని లైన్ ఏంటో తెరపై చూడండి.. అంటున్నారు `కొత్త‌గా మా ప్ర‌యాణం` సినిమా హీరో ప్రియాంత్. యామిని భాస్క‌ర్ క‌థానాయిక‌ నటిస్తున్న ఈ సినిమా నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతోంది. ర‌మ‌ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ నెల 25న ఈ సినిమా రిలీజ‌వుతోంది. కాగా ప్రియాంత్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

*ఈ చిత్రంలో కార్తీక్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్ర‌లో న‌టించాను. నెల‌కు రూ.2ల‌క్ష‌లు సంపాదించే కుర్రాడి లైఫ్ స్టైల్ పై సినిమా ఇది. హార్డ్‌ కోర్ మెంటాలిటీ.. ముక్కుసూటి గా ఉండే కుర్రాడి క‌థ‌. ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకుంటాయి.

*స్వేచ్ఛా జీవ‌నానికి అల‌వాటు ప‌డితే ఎలా ఉంటుంది ? హాస్ట‌ల్స్ లో ఉండే కుర్రాళ్ల లైఫ్ ఎలా ఉందో చూపించాం. ఇక నా గురించి అయితే నేను ఎస్‌.బ్యాంక్ లో ఒక డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను. జూబ్లీహిల్స్ బ్రాంచ్ లో 9ఏళ్ల అనుభ‌వం ఉంది. ఆ క్ర‌మంలోనే ఏడెనిమిదేళ్లుగా ఇండ‌స్ట్రీలో క‌థానాయ‌కుడిగా ట్ర‌య‌ల్స్ లోనే ఉన్నాను. ఇప్ప‌టికి అవ‌కాశం ద‌క్కింది. న‌ట‌న ప‌రంగా నాకు ఎలాంటి శిక్ష‌ణ లేదు.

*ఈ సినిమా అన్ని సినిమాల్లా రొటీన్ గా ఉండ‌దు అని నేను చెప్ప‌ను. అయితే యువ‌త‌రం ఎలా ఉన్నారు? అన్న‌ది తెర‌పై చూపిస్తున్నాం. చ‌క్క‌ని ఫీల్ తో సినిమా సాగుతుంది. త‌ల్లిదండ్రులు, బంధువులు పిల్ల‌ల క‌ల్చ‌ర్ వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు? అన్న‌ది తెర‌పై చూడొచ్చు. అమ్మాయి- అబ్బాయి క‌లిసి ఉంటే సంఘంలో ఎలా మాట్లాడుకుంటారు? పేరెంట్ కి ఎలాంటి స‌మ‌స్య‌లొస్తాయి? అన్న‌ది చూడొచ్చు.


సంబంధిత సమాచారం :