క్రికెట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో మరో ఇంట్రస్టింగ్ సినిమా !

Published on May 20, 2019 6:18 pm IST

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్‌’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ”తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. జూన్‌ మూడోవారంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ”లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న విభిన్న చిత్రం. ఒక మంచి సబ్జెక్ట్‌తో, ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుంది. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేయడం జరిగింది. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్‌ ఒక స్పెషల్‌ రోల్‌ చేయడం ఈ చిత్రానికి హైలైట్‌. ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని అందరికీ కలిగిస్తుంది” అన్నారు.

సంబంధిత సమాచారం :

More