ట్రైలర్ తో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి !

ట్రైలర్ తో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి !

Published on Aug 20, 2019 12:17 AM IST

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌’. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఆగష్టు 19 న విడుదల చేశారు. ఒక అమ్మాయి ఇండియా తరఫున క్రికెటర్ గా ఆడాలన్న తన కల కోసం పడ్డ తపన, కష్టం ప్రతిబింబించేలా ట్రైలర్ సాగింది. చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, బ్యూటీ క్వీన్ రాశీ ఖన్నా ముఖ్య అతిధులుగా మంగళవారం (ఆగష్టు 20న) జె ఆర్ సి బాల్ రూమ్, హైదరాబాద్ నందు జరుగనుంది.

తన తండ్రిని సంతోషపెట్టడానికి క్రికెటర్ అవుతానని ఒక చిన్న పాప చెప్పే డైలాగ్ తో మొదలయ్యే ట్రైలర్ ‘ గవాస్కర్, సచిన్ క్రికెట్ లోకి కొడుకుల్ని పంపించారు తప్ప కూతుర్లని పంపించలేదు కదా..’, ‘ మగపిల్లలతో కలిసి మగరాయుడు లాగా బ్యాట్ ఆట ఆడతావే..’ లాంటి డైలాగులు అమ్మాయిలు క్రికెట్ ఆడటం పట్ల అదీ పల్లెటూళ్లలో ఎలాంటి వైఖరితో ఉంటారో చెప్తుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ క్రికెట్ ని ప్రేమించే రైతు కృష్ణమూర్తిగా, క్రికెటర్ అవ్వాలని పరితపించే ఆయన కూతురు కౌసల్య గా ఐశ్వర్య రాజేష్ నటన, స్ట్రైకింగ్ డైలాగ్స్ హైలైట్ గా ట్రైలర్ ఆకట్టుకునేలా సాగుతుంది. ‘నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్ళని కాదు… నిన్ను’, ‘ ఈ లోకం గెలుస్తానని చెప్తే వినదు.. కానీ గెలిచినా వాళ్ళు చెప్తే వింటుంది. నువ్వు ఎం చెప్పినా గెలిచి చెప్పు…’ అని శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు స్ఫూ ర్తి నింపేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజ కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు