‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌’కి రెడీ అవుతోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ !

Published on Aug 15, 2019 12:00 am IST

ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకం పై క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌’. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

కాగా లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుందట. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేస్తున్నారు. ఇక భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాలో ఏ చిన్న పొరపాటు కూడా ఉండకూడదని చాల జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేశారట. అలాగే హనుమాన్‌ చౌదరి రాసిన మాటలు కూడా సినిమాలో హైలెట్ అవుతాయని తెలుస్తోంది. కాగా ఆగష్టు 18న గ్రాండ్‌ గా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ ను ప్లాన్‌ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :