ఓటీటీలోనూ మాస్ మహారాజ్ దూకుడు

Published on Feb 27, 2021 1:10 am IST


సంక్రాంతికి విడుదలైన రవితేజ ‘క్రాక్’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ అందుకున్న మొట్టమొదటి విజయం ఇదే. 50 శాతం ఆక్యుపెన్సీలో కూడ వసూళ్లు దుమ్మురేపింది. హక్కుల్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను చూశారు. ఈ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కారు. సంక్రాంతి విజేతగా నిలిచారు. థియేటర్లలో మాస్ ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.

ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ ద్వారా విడుదలచేశారు. అక్కడ కూడ సినిమా మాస్ మహారాజ్ మేనియా కనబడుతోంది. ఇప్పటి వరకు సినిమా 250 మిలియన్ వ్యూస్ మినిట్స్ అందుకుందట. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. అంటే ఇక్కడ సినిమా హిట్ కొట్టేసినట్టే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించారు. ఇందులో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటించింది.

సంబంధిత సమాచారం :