“క్రాక్” మాస్ బ్యాటింగ్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.!

Published on Jan 27, 2021 12:00 pm IST

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “క్రాక్”. పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ సినిమా అందుకున్న విజయం రీసౌండ్ ఓ రేంజ్ లో వినిపిస్తుంది.

అంతే కాకుండా ఈ సినిమా బ్యాటింగ్ ఇంకా ఎండ్ అవ్వకపోగా అంతే సూపర్ సాలిడ్ గా నిలబడుతూ అందరి అంచనాలను తల కిందులు చేస్తుంది. తాజా టాక్ ప్రకారం అయితే నైజాం లో కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా గ్రౌండ్ సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రాలో అయితే ఆల్ మోస్ట్ అన్ని టైమింగ్స్ షోలు కూడా ఫుల్స్ పడుతున్నాయని తెలుస్తుంది.

దీనిని బట్టి “క్రాక్” సినిమా ఏ సుతఃయి హిట్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగా సముథ్రఖని వరలక్ష్మి శరత్ కుమార్ లు అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ మరి దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.

సంబంధిత సమాచారం :

More